AB Venkateswara Rao: ఇది రాజకీయ సమరమే.. మా మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర.. వంగవీటి రాధాపై ఏబీవీ హాట్ కామెంట్స్!

ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao), వంగవీటి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

AB Venkateswara Rao sensational comments on Vangaveeti Radha

AB Venkateswara Rao: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతున్న వేళ, బెజవాడ మేయర్ పీఠం కోసం జరుగుతున్న పోరు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV), జనసేన మేయర్ అభ్యర్థిగా పోటీ పడుతున్న వంగవీటి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా తనకు గత రెండు దశాబ్దాలుగా సుపరిచితుడని, రాధా తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా సేవలు అందించానని ఆయన గుర్తు చేసుకున్నారు.

Telangana Police: తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పులు.. కొత్తగా 112 మంది డీఎస్పీలు.. కోర్టు కేసులు వెనక్కి, వివాదానికి ముగింపు

వ్యక్తిగత వైర ముండదు, కేవలం రాజకీయ సమరమే.. ప్రత్యర్థుల కుట్రలపై ఫైర్:

వంగవీటి రాధాతో తమ మధ్య ఉన్నది కేవలం సిద్ధాంతపరమైన రాజకీయ సమరమే తప్ప వ్యక్తిగత పోరాటం కాదని ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao)స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను రాధాపై ఒక్క పరుష పదం కూడా మాట్లాడనని, అలాగే రాధా కూడా తనపై విమర్శలు చేయరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ఇద్దరి మధ్య ఉద్దేశపూర్వకంగా చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము సహనం వీడబోమని, ప్రచారంలో డీజేలు కూడా వాడకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తున్నామని వివరించారు.

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.. ఎస్‌ఈసీ తీరుపై సంచలన ఆరోపణలు:

ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు గుప్పించిన ఏబీవీ, అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా తక్కువ వ్యవధి ఇచ్చిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పాత్ర నామమాత్రంగా మారిందని, మొత్తం ప్రక్రియను ప్రభుత్వమే తమ చేతుల్లోకి తీసుకుని నడిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఏదేమైనా విజయవాడ వంటి చారిత్రాత్మక నగరానికి మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, నగర అభివృద్ధిని కాంక్షించే ప్రజలు తీర్పునిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.