CM Jagan: ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చిన జగన్ ప్రభుత్వం
ఏపీలోని నర్సిపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఈ ఘటనపై టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు స్పందించారు.
- Subhan Ali Shaik
- Published On : June 19, 2022 / 08:37 AM IST
Atchenaidu
CM Jagan: ఏపీలోని నర్సిపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఈ ఘటనపై టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఇంటిగోడను కూల్చిన ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడిపై సీఎం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని విమర్శించారు.
“సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా చరిత్రలో నిలిచిపోతారు. పోలీసులు అధికారపక్షానికి ఇప్పుడు సపోర్టింగ్‌గా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని గుర్తుంచుకోండి”
Read Also: టెక్కలి రోడ్డుపై అచ్చెన్నాయుడును దొర్లించి కొడతా..
“జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలుగా జరుగుతూ పోలీసుల అతిప్రవర్తనకు అదుపు లేకుండా పోయింది. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనం” అంటూ తీవ్ర విమర్శలకు దిగారు అచ్చెన్నాయుడు.
