Vijayawada Play School Representative Image (Image Credit To Original Source)
Vijayawada: విజయవాడ విద్యాధరపురంలో దారుణం జరిగింది. మూడేళ్ల పాప పట్ల ప్లే స్కూల్ టీచర్ అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. చిన్నారిపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్ లో ఈ ఘోరం జరిగింది. ఫిబ్రవరి 23న పాపను స్కూల్ దగ్గర దింపి తల్లి వెళ్లిపోయింది. కాసేపటికే స్కూల్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పాప బాత్ రూమ్ లో పడిపోయిందని చెప్పారు. వెంటనే తల్లి స్కూల్ దగ్గరికి వెళ్లింది. అప్పటికే అక్కడ ఏడుస్తూ ఉన్న కూతురిని చూసి తల్లడిల్లిపోయింది. పాపకు అయిన గాయాలు చూసి తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా షాకింగ్ నిజాలు తెలిశాయి. పాపపై యాసిడ్ దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాప తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్లి యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. ఏం జరిగిందో నిజం చెప్పాలన్నారు. దీంతో స్కూల్ యాజమాన్యం నిజం ఒప్పుకుంది. హాస్పిటల్ బిల్లు కట్టి చేతులు దులుపుకుంది స్కూల్ యాజమాన్యం. తర్వాత కొంత డబ్బు ఇచ్చి రాజీకి రావాలని పాప పేరెంట్స్ ను కోరింది స్కూల్ యాజమాన్యం. దీనికి పాప తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగింది.
ఈ విషయాలు బయటకు చెప్తే మీ అంతు చూస్తాం అంటూ స్కూల్ ప్రిన్సిపాల్ తమకు వార్నింగ్ ఇచ్చారని పాప తల్లిదండ్రులు ఆరోపించారు. డీసీపీ మా చుట్టం అంటూ బెదిరించారని అన్నారు. చిన్నారి అని కూడా చూడకుండా ఇంత కిరాతకంగా వ్యవహరించిన టీచర్ ని కఠినంగా శిక్షించాలని పాప తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:విజయవాడ దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో భారీ చోరీ.. 50 లక్షల బంగారం మిస్సింగ్