Aggipette Maccha Passed Away : అనారోగ్యంతో ‘అగ్గిపెట్టె మచ్చ’ కన్నుమూత.. చిగురువాడలో అంత్యక్రియలు

Aggipette Maccha Passed Away : యూట్యూబర్‌ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్‌ కిరణ్‌ కుమార్‌ అనారోగ్యంతో మృతి చెందారు. యూట్యూబ్‌ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Aggipette Maccha Passed Away

Aggipette Maccha Passed Away : తనదైన శైలిలో కామెడీ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన యూట్యూబర్ అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ ను కుటుంబ సభ్యులు తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read : AP Weather : ఏపీలో వేగంగా మారుతున్న వాతావరణం.. 15జిల్లాలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు..

కిరణ్ కుమార్‌ది తిరుపతి జిల్లా రూరల్ మండలం చిగురువాడ గ్రామం. ‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో ఆయన సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఆయన మాట్లాడే విధానం, ప్రత్యేకమైన డైలాగులు, తనదైన శైలిలో హావభావాలతో కామెడీని పండించినతీరు సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో కొద్దికాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

కొన్నివర్గాల ప్రజల్లో అగ్గిపెట్టె మచ్చ‌కు ఉన్న క్రేజ్ కారణంగా పలువురు యూట్యూబర్లు ఆయన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూలుసైతం చేశారు. అంతేకాదు.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ కార్యక్రమాల్లోనూ ఆయన సందడి చేశారు.

అగ్గిపెట్టె మచ్చ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు యూట్యూబర్లు, కళాకారులు అగ్గిపెట్టె మచ్చ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే, గురువారం చిగురువాడ పంచాయతీ వైఎస్ఆర్ కాలనీలోని ఆయన సోదరి ఇంటి వద్ద నుంచి అగ్గిపెట్టె మచ్చ అంతిమయాత్ర మొదలుకానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.