Amaravati Land Pooling: ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు.. రెండో విడత భూసమీకరణకు రైతులు సిద్ధం.. సీఆర్డీఏకు అంగీకార పత్రాల అందజేత

ఆంధ్రప్రదేశ్ రాజధాని రెండో విడత భూసమీకరణ ప్రక్రియకు భూములిచ్చేందుకు(Amaravati Land Pooling) రాజధాని ప్రాంత రైతులు ముందుకు వస్తున్నారు.

Amaravati capital second phase land government pooling 14 acres

Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం నిర్వహిస్తున్న రెండో విడత భూసమీకరణ (Amaravati Land Pooling) ప్రక్రియకు భూములిచ్చేందుకు రాజధాని ప్రాంత రైతులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠపురం గ్రామ పరిధిలోని మాదల కుటుంబం తమకు చెందిన 14.365 ఎకరాల భూమిని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ (AP CRDA)కు అందజేసేందుకు అంగీకరించింది. రాజధాని నిర్మణంలో భాగస్వామ్యం కావడం పట్ల ఆ రైతు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.

AP Junior Doctors: ఏపీ జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. వైద్య విద్యార్థుల సంతోషం

రాయపూడి కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులకు అంగీకార పత్రాలు:

రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాదల శ్రీనివాసరావు కుటుంబసభ్యులు సీఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్‌కు అధికారిక అంగీకార పత్రాలను అందజేశారు. ఈ సమీకరణలో భాగంగా మాదల శ్రీనివాసరావు నుంచి 4.395 ఎకరాలు, మాదల అప్పారావు నుంచి 4.985 ఎకరాలు, అలాగే మాదల రాంబాబు నుంచి 4.985 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ బి. కన్యాకుమారి, ఇతర అధికారులు పాల్గొని రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

అమరావతి అభివృద్ధికి గ్రామాల ప్రజలు సహకరించాలి:

నవ్యాంధ్ర రాజధాని నగరం ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన మాదల కుటుంబ సభ్యులు కోరారు. రెండో విడత భూసమీకరణకు అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు పూర్తిస్థాయిలో సహకరించి రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు.