Andhra Boy German Girl Wedding: సరిహద్దులు దాటిన ప్రేమ.. జర్మనీ అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి పెళ్లి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు, జర్మనీ(Andhra Boy German Girl Wedding)లో స్థిరపడిన విదేశీ యువతి హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Andhra boy married german girl in traditional wedding at narasaraopet

  • జర్మనీ అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహం.
  • కాలేజీ పరిచయం ప్రేమగా మారి పెళ్లి.
  • రెండు సంప్రదాయాల్లో వైభవంగా వేడుక.

Andhra Boy German Girl Wedding: ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు, జర్మనీ(Andhra Boy German Girl Wedding)లో స్థిరపడిన విదేశీ యువతి హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు, బంగారమ్మల కుమారుడు యాంపాటి వెంకటేశ్వర్లు కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో రష్యా మూలాలు ఉండి, జర్మనీలో స్థిరపడిన పలీనాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది.

Strait Of Hormuz: ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్.. హార్ముజ్ జలసంధి మళ్లీ మూసివేత

ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇద్దరూ జర్మనీలోనే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని ఇరువైపులా పెద్దలకు చెప్పి వారిని ఒప్పించారు. ప్రస్తుతం నరసరావుపేటలో నివసిస్తున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, అలాగే జర్మనీ నుంచి వచ్చిన పలీనా తల్లిదండ్రుల సమక్షంలో నరసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్‌ హాలులో వీరి వివాహం అత్యంత వేడుకగా జరిగింది. భిన్న సంస్కృతులకు చెందిన ఈ జంట సంప్రదాయబద్ధంగా ఒక్కటవ్వడాన్ని చూసి ఇరు కుటుంబాల బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కొత్త దంపతులను ఆశీర్వదించారు.