Andhra pradesh 10th class ssc hall tickets 2026 released download process details
AP SSC Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అలర్ట్. మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (BSEAP) 2026 పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి 2వ తేదీన విడుదల చేసింది. విద్యార్థులు వీటిని నేరుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసి, సంతకం మరియు సీలు వేసి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
పాఠశాలకు వెళ్లే అవసరం లేకుండా నేరుగా హాల్ టికెట్లు పొందాలనుకునే వారు bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా తమ హాల్ టికెట్లను పొందే వెసులుబాటు ఉంది. హాల్ టికెట్ తీసుకున్న తర్వాత దానిపై ఉన్న విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఫొటో, పరీక్షా కేంద్రం మరియు పరీక్ష షెడ్యూల్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమై మార్చి 30వ తేదీతో ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్టులో జరుగుతాయి. హాల్ టికెట్ లేని విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కాబట్టి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ముందుగానే సిద్ధం చేసుకోవడం ఉత్తమం అని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.