AP Cabinet : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరికి ఏఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆ ఉత్కంఠతకు తెరదించుతూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ అండ్ ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు ఉన్నాయి.
1. కొణిదెల పవన్ కళ్యాణ్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ,
2. నారా లోకేశ్ : ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి, ఆర్టీజీ
3. కింజరాపు అచ్చెన్నాయుడు : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య
4. కొల్లు రవీంద్ర : గనులు అండ్ భూగర్భం, అబ్కారీ
5. నాదెండ్ల మనోహర్ : ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
6. పొంగూరు నారాయణ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి
7. వంగలపూడి అనిత : హోం అండ్ విపత్తు నిర్వహణ
8. సత్యకుమార్ యాదవ్ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం అండ్ వైద్యవిద్య
9. నిమ్మల రామానాయుడు : జల వనరుల అభివృద్ధి
10. ఎన్ఎండీ ఫరూఖ్ : న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం
11. ఆనం రామనారాయణ రెడ్డి : దేవాదాయ శాఖ
12. పయ్యావుల కేశ్ : ఆర్థికశాఖ, అసెంబ్లీ వ్యవహారాలు
13. అనగాని సత్యప్రసాద్ : రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్
14. కొలుసు పార్థసారధి : గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాలు
15. డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి: సాంఘీక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం అండ్ విలేజ్ వలంటీర్
16. గొట్టిపాటి రవికుమార్: విద్యుత్
17. కందుల దుర్గేశ్ : టూరిజం, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ
18. గుమ్మడి సంధ్యారాణి : మహిళా అండ్ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
19. బీసీ జనార్దన్ రెడ్డి : రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు.
20. టీజీ భరత్: పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఆహారశుద్ది
21. ఎస్.సవిత: బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్
22. వాసంశెట్టి సుభాష్ : కార్మిక – కర్మాగార బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలు
23. కొండపల్లి శ్రీనివాస్: ఎంఎస్ఎంఈ, సెర్ప్
24. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి: రవాణా శాఖ, యువజన అండ్ క్రీడలు