AP YCP Manifesto : ఈ నెల 20న వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..!
మార్చి 20న వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. సీఎం జగన్ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
- Sreehari A
- Published On : March 16, 2024 / 11:12 PM IST
CM Ys Jagan Mohan Reddy to be released YCP Manifesto on March 20
AP YCP Manifesto : వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోపై దృష్టిపెట్టారు. మార్చి 20న వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. ఈ మేరకు సీఎం జగన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది.
Read Also : ఎన్నికల వేళ గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తున్న కవిత అరెస్టు పరిణామం
అయితే, వైఎస్ జగన్ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. డ్రాఫ్టింగ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసే వీలుంది. మరో రెండు రోజుల్లో ఈ పనులు కూడా పూర్తవుతాయని అంచనా. ఆ వెంటనే వైసీపీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
అయితే, ఏపీ ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఏపీలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడమే లక్షంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే వైసీపీ మ్యానిఫెస్టో ఉండవచ్చునని విశ్వసనీయ సమాచారం.
నవరత్నాల తరహాలో అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల వారిని ఆకట్టుకునేలా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, మహిళలు, రైతుల, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని వైసీపీ మ్యానిఫెస్టో ఉండనుందని అంటున్నారు. ఈ నెల 20న వైసీపీ మ్యానిఫెస్టోపై పూర్తి స్పష్టత రానుంది.
