AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,627 కరోనా కేసులు.. 17 మరణాలు
సోమవారం ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,627 మందికి కరోనా సోకింది. 17 మంది మృతిచెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 21 వేల 748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
- kunduru Vinod
- Published On : July 26, 2021 / 05:15 PM IST
Ap Corona Cases
AP Corona Cases : సోమవారం ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,627 మందికి కరోనా సోకింది. 17 మంది మృతిచెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 21 వేల 748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 13 వేల 273 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 017 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు కరోనాతో చనిపోయారు.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు
అనంతపురం 16. చిత్తూరు 357. ఈస్ట్ గోదావరి 284. గుంటూరు 81. వైఎస్ఆర్ కడప 126. కృష్ణా 103. కర్నూలు 12. నెల్లూరు 216. ప్రకాశం 235. శ్రీకాకుళం 26. విశాఖపట్టణం 57. విజయనగరం 4. వెస్ట్ గోదావరి 110. మొత్తం : 1,627
