Ap DSC Notification: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో DSC నోటిఫికేషన్.. 16,347 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ(Ap DSC Notification) ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు పాఠశాల విద్యాశాఖ అత్యంత తీపి కబురు అందించింది.

Andhra pradesh dsc new notification in october exams in december

  • అక్టోబర్‌లో డీఎస్సీ కొత్త నోటిఫికేషన్
  • డిసెంబర్‌ నెలలోనే పరీక్షల నిర్వహణ
  • దుష్ప్రచారం నమ్మవద్దని విద్యాశాఖ హెచ్చరిక

Ap DSC Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు పాఠశాల విద్యాశాఖ అత్యంత తీపి కబురు అందించింది. గత కొద్దిరోజులుగా డీఎస్సీ నియామకాలపై సాగుతున్న వివిధ పుకార్లు, వివాదాల నడుమ విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ప్రకటనతో స్పష్టత లభించింది. రాబోయే అక్టోబర్ నెలలో సరికొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, డిసెంబర్‌లోనే పరీక్షలను పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమరావతిలో వెల్లడించారు.

Delhi Techie Crime: దేశ రాజధానిలో ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను హత్య.. పక్కా ప్లాన్, చివరికి బిగ్ ట్విస్ట్

పారదర్శకంగా నియామకాలు, దుష్ప్రచారాన్ని నమ్మవద్దు:

మెగా డీఎస్సీ(Ap DSC Notification) ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంతో పారదర్శకంగా భర్తీ చేశామని కమిషనర్ తెలిపారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని హితవు పలికారు. ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు విద్యాశాఖ పూర్తిగా అండగా ఉంటుందని, అభ్యర్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా రాబోయే పరీక్షలపైనే దృష్టి సారించాలని సూచించారు.

స్పోర్ట్స్ కోటా పరిశీలన పూర్తి, క్లారిటీ ఇచ్చిన ఎస్ఏపీ:

మరోవైపు స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాలపై ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAP) వైస్ చైర్మన్ & ఎండీ భరణి కీలక వివరాలు వెల్లడించారు. వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్ల నుంచి సమాచారం సేకరించి, ప్రతి అభ్యర్థి క్రీడా పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రాథమిక ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి విద్యాశాఖకు సమర్పించినట్లు స్పష్టం చేశారు. దీంతో కొత్త డీఎస్సీ రాకపై అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.