AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ గౌరవవేతనాల కింద రూ.22.50కోట్లు విడుదల

AP Govt Imams and Mouzan : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇమామ్, మౌజమ్‌లకు తీపికబురు చెప్పింది.

Andhra Pradesh government has released three months salary for Imams and Mouzan

AP Govt Imams and Mouzan : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇమామ్, మౌజమ్‌లకు గౌరవవేతనాలను విడుదల చేసింది. మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజమ్‌ల గుర్తింపుగా గౌరవ వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, తాజాగా.. మూడు నెలలకు ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవవేతనాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం రూ.22.50కోట్లు విడుదల చేసింది.

Also Read : AP Rain Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో నాలుగురోజులు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..

ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. 2026-27 ఏడాదికి సంబంధించి జులై నుంచి సెప్టెంబర్ వరకు వేతనాల చెల్లింపునకు ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. నిధులు విడుదల పట్ల సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సాంకేతిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉండనున్నందున, జీతాల చెల్లింపు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో నిధులను ముందే విడుదల చేసినట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.

ఏపీలోని మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు నెలకు రూ.5వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,911 మంది ఇమామ్‌లు, 4,991 మంది మౌజన్లు కలిపి మొత్తం 9,982 మంది ఉన్నారు. ఇప్పుడు మూడు నెలల వేతనం ఒకేసారి ఇస్తుండటంతో ఒక్కో ఇమామ్ అకౌంట్‌లో రూ.30,000, మౌజమ్ అకౌంట్‌లో రూ.15,000 ఒకేసారి జమ కానున్నాయి. అయితే, గత 27నెలలకు కలిపి ఇప్పటి వరకు ఇమామ్‌లు, మౌజన్లకు మొత్తం రూ.202కోట్ల గౌరవ వేతనాన్ని అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.