AP Govt : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వినియోగదారులకు ఊరట!
AP Govt Electricity Charges : ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి.
- Harish Thanniru
- Published on- July 15, 2026 / 08:07 AM IST
Andhra Pradesh government Key decision Electricity charges set to decrease soon
- ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..
- కరెంటు యూనిట్‌పై మరో 13పైసలు తగ్గింపునకు చర్యలు
- ఏపీఈఆర్‌సీ ఆమోదం రాగానే అమల్లోకి
AP Govt Electricity Charges : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా పథకాలను అమలు చేస్తున్న సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ప్రజలకు ఊరట లభించనుంది.
విద్యుత్ పంపిణీ సంస్థలు వరుసగా రెండోసారి ట్రూడౌన్ అమలు దిశగా చర్యలకు సిద్ధమయ్యాయి. అంటే విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు అడుగులు వేస్తున్నాయి. యూనిట్ కు మరో 13పైసల భారం తగ్గించనున్నాయి. ఏపీఈఆర్‌సీ ఆమోదం రాగానే తగ్గింపు అమల్లోకి రానుందని అధికారులు పేర్కొంటున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ఏపీఈఆర్‌సీకి సమర్పించిన ఇంధన సర్దుబాటు ఖర్చు (ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్అడ్జెస్ట్‌మెంట్-ఎఫ్‌పీపీసీఏ)ల్లో రూ.940.07 కోట్లను మిగులుగా చూపాయి. ట్రూడౌన్ సహా అవి ఇచ్చిన వివరాలను ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ఏపీఈఆర్సీ ఆమోదించనుంది. ఆ తరువాత 940 కోట్లను ట్రూడౌన్ చేసి యూనిట్ పై 13పైసల వరకు భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండోసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి తక్కనుంది.
ఎన్నికల సమయంలో విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీల భారం వేయమోమని కూటమి హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. వినియోగదారులపై ట్రూఅప్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు బహిరంగ మార్కెట్ కొనుగోళ్లను ప్రభుత్వం నియంత్రించింది. దీంతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలుకు చేసే సగటు వ్యయాన్ని తగ్గించింది. విద్యుత్ కేంద్రాల అంతర్గత సామర్థ్యాన్ని పెంచి.. ఉత్పత్తి పెంచింది. దీంతో అధిక ధరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోళ్లు తగ్గాయి.
