AP Inter Results 2026 : AP ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలపై ప్రకటన చేసిన మంత్రి లోకేష్.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

AP Inter Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ దీనిపై ప్రకటన చేశారు.

Andhra pradesh inter first and second year results 2026 will announce april 15 how to check it

AP Inter Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రిజల్ట్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 15న (బుధవారం) ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు. బుధవారం, ఏప్రిల్ 15, బుధవారం ఉదయం 10:31 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.

ఈ ప్రకటనతో గత కొన్నాళ్లుగా ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల నిరీక్షణకు రేపటితో ముగింపు లభించనుంది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’ తెలియజేశారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

విద్యార్థులు తమ ఫలితాలను రెండు పద్ధతుల్లో సులభంగా తెలుసుకోవచ్చు:

1. వెబ్‌సైట్ ద్వారా:

  • ముందుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాలి.
  • హోమ్ పేజీలో ‘First Year Results’ లేదా ‘Second Year Results’ అనే ఆప్షన్లపై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
  • వెంటనే మీ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
  • దీనిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.

2. వాట్సాప్ (WhatsApp) ద్వారా:

  • ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 కు వెళ్లాలి.
  • ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా క్షణాల్లో మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.

విద్యార్థులు రద్దీ కారణంగా వెబ్‌సైట్ నెమ్మదించే అవకాశం ఉన్నందున ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచించారు.