AP Covid Cases update : ఏపీలో కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
- chvmurthy
- Published On : November 6, 2021 / 05:21 PM IST
Ap Covid Update
AP Covid Cases update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నుంచి 406 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,568 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,921 కి చేరింది.
వీరిలో 20,49,961 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,392కు చేరింది.
Also Read : Tirumala : తిరుమలలో 3 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు
మరో వైపు దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 108,20, కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ వేశారు.
