AP Mayor Reservations : ఏపీలో మేయర్‌ స్థానాల రిజర్వేషన్లు ఫిక్స్‌.. బీసీలకు ఎన్ని సీట్లంటే? 17 నగరాల ఫుల్ లిస్ట్ ఇదే..!

AP Mayor Reservations : ఏపీలో 17 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ మహిళలు, అన్‌రిజర్వ్‌డ్‌ కేటాయింపులతో పాటు నగరాల వారీ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

AP Mayor Reservations

  • ఏపీ మేయర్‌ రిజర్వేషన్ల ఖరారు.. ఏ నగరానికి ఏ కేటగిరీ అంటే?
  • కాకినాడ నుంచి నెల్లూరు వరకు.. ఏపీ మేయర్‌ రిజర్వేషన్ల వివరాలు
  • మేయర్‌ పీఠాలపై రిజర్వేషన్ల ప్రకటన.. 17 నగరాల పూర్తి జాబితా ఇదే!

AP Mayor Reservations : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేయర్‌ స్థానాల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు కేటగిరీల వారీగా కేటాయింపులు ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ మహిళలు, అన్‌రిజర్వ్‌డ్‌ విభాగాలకు ప్రాధాన్యం కల్పించారు.

ఈ కేటాయింపులతో బీసీ వర్గాలకు మొత్తం 5 మేయర్‌ స్థానాలు దక్కాయి. ఎస్సీలకు 2, ఎస్టీలకు ఒక స్థానం కేటాయించారు. మహిళలకు జనరల్‌ కేటగిరీలో 5 స్థానాలు ఉండగా, మరో 4 స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా నిర్ణయించారు. మేయర్‌ పదవులకు సంబంధించిన ఈ రిజర్వేషన్లు ఆయా నగరాల్లో స్థానిక రాజకీయ సమీకరణాలకు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Read Also : RRB NTPC Recruitment 2026 : డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!

రిజర్వేషన్ల కేటాయింపులివే :

మంగళగిరి తాడేపల్లి : ఎస్టీ
రాజమహేంద్రవరం : ఎస్సీ
కర్నూలు : ఎస్సీ

మచిలీపట్నం : బీసీ మహిళ
కాకినాడ : బీసీ మహిళ

ఏలూరు : బీసీ జనరల్‌
అనంతపురం : బీసీ జనరల్‌
చిత్తూరు : బీసీ జనరల్‌

విజయనగరం : జనరల్‌ మహిళ
శ్రీకాకుళం : జనరల్‌ మహిళ
గుంటూరు : జనరల్‌ మహిళ
కడప : జనరల్‌ మహిళ
విశాఖ : జనరల్‌ మహిళ

తిరుపతి : అన్‌రిజర్వ్‌డ్‌
విజయవాడ : అన్‌రిజర్వ్‌డ్‌
ఒంగోలు : అన్‌రిజర్వ్‌డ్‌
నెల్లూరు : అన్‌రిజర్వ్‌డ్‌