Mee Mart Stores: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ‘మీ మార్ట్’ షాపులు షురూ.. 5 రూపాయలకే సరుకులు
గుంటూరులో 'మీ మార్ట్(Mee Mart Stores) స్టోర్లను ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
- V Santhosh Kumar
- Published on- July 6, 2026 / 09:16 PM IST
Andhra Pradesh Minister Nadendla Manohar launched 'Mee Mart' stores in Guntur
- లాలుపురంలో మీ మార్ట్ ప్రారంభం
- మార్కెట్ కంటే తక్కువ ధరలు
- వెయ్యి కొత్త షాపుల లక్ష్యం
Mee Mart Stores: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సామాన్యులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే అందించాలనే ఆశయంతో ప్రవేశపెట్టిన ‘మీ మార్ట్(Mee Mart Stores)’ వినూత్న విక్రయశాలను గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఘనంగా ప్రారంభించారు. రేషన్ వ్యవస్థను కేవలం బియ్యం పంపిణీకే పరిమితం చేయకుండా, ప్రజల ముంగిటకే మినీ సూపర్ బజార్లను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
Nirav Modi: బ్యాంకులను ముంచిన మోసగాడికి ఎండ్ కార్డ్.. ఏ క్షణమైనా నీరవ్ మోదీ అప్పగింత!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సుమారు 29,750 రేషన్ దుకాణాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం లాలుపురం ‘మీ మార్ట్’ లో నిత్యం అవసరమయ్యే 50 రకాల నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచామని, రానున్న రోజుల్లో ఈ సరుకుల సంఖ్యను 250 రకాలకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
లాలుపురం దుకాణానికి వచ్చే ఆదరణ, ప్రజల స్పందనను బట్టి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,000 ‘మీ మార్ట్’ స్టోర్లను విస్తరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ దుకాణాల్లో ప్రతి వస్తువుపై ఐదు రూపాయల వరకు తక్కువ ధరకే లభిస్తుందని, దీనివల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. నాణ్యత, సరసమైన ధరల కలయికగా రాబోతున్న ఈ ‘మీ మార్ట్’ లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఎంతగానో మేలు చేయనున్నాయి.
