AP Municipal Chairperson Posts : ఏపీ మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్ల జాబితా విడుదల.. 5 కేటగిరీల్లో ఎన్ని స్థానాలంటే!
AP Municipal Chairperson Posts : ఏపీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల 2026 చైర్‌పర్సన్ రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల వారీగా స్థానాల పూర్తి జాబితాపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Updated on- October 12, 2026 / 06:39 PM IST
AP Municipal Chairperson Posts
- మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు ప్రకటన
- ఎస్టీ నుంచి జనరల్ వరకు పూర్తి లెక్క ఇదే
- ఏ మున్సిపాలిటీ ఏ కేటగిరీకి ఎన్ని?
- 2026 రిజర్వేషన్ల వివరాలివే
AP Municipal Chairperson Posts : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులకు సంబంధించిన 2026 రిజర్వేషన్ల వివరాలపై ఆసక్తి నెలకొంది. షెడ్యూల్-II పేరుతో అందించిన జాబితాలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు, అన్‌రిజర్వ్‌డ్ విభాగాల వారీగా స్థానాలను పేర్కొన్నారు.
ఎస్టీ కేటగిరీ : 3 స్థానాలు
ఎస్టీ విభాగంలో గూడూరు (N) మహిళలకు కేటాయించగా, ఆళ్లూరు, ఆత్మకూరు (K) జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
ఎస్సీ కేటగిరీ: 14 స్థానాలు
ఎస్సీ విభాగంలో 14 స్థానాలున్నాయి. చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గూటి, చీరాల మహిళలకు కేటాయించిన జాబితాలో ఉన్నాయి. వుయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పామూరు/పొదిలి, బాపట్ల ఎస్సీ జనరల్ విభాగంలో పేర్కొన్నారు.
బీసీ కేటగిరీ: 36 స్థానాలు
ఈ విభాగంలో అత్యధికంగా 36 స్థానాలున్నట్లు జాబితా చెబుతోంది. ఆళ్లగడ్డ, సాలూరు, ఇచ్ఛాపురం, నర్సీపట్నం, తుని, పాలకొల్లు, కదిరి, గుడివాడ, రాజంపేట తదితర మున్సిపాలిటీలు బీసీ మహిళల జాబితాలో ఉన్నాయి. పిడుగురాళ్ల, పుత్తూరు, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మదనపల్లె, నంద్యాల, హిందూపూర్, రాయచోటి తదితర ప్రాంతాలు బీసీ జనరల్ విభాగంలో ఉన్నాయి.
జనరల్ మహిళలు: 27 స్థానాలు
కానిగిరి, కమలాపురం, కొవ్వూరు, వెంకటగిరి, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, భీమవరం, జగ్గయ్యపేట, ఆదోని, రేపల్లె, పార్వతీపురం, పులివెందుల తదితర ప్రాంతాలు ఈ విభాగంలో ఉన్నాయి.
అన్‌రిజర్వ్‌డ్: 26 స్థానాలు
తణుకు, తెనాలి, గురజాల, తాడేపల్లిగూడెం, అమలాపురం, కావలి, ప్రొద్దుటూరు, నందిగామ, మండపేట, నగరి, రాయదుర్గం, వినుకొండ, ధర్మవరం, మార్కాపురం, నరసరావుపేట తదితర ప్రాంతాలను అన్‌రిజర్వ్‌డ్ జాబితాలో చేర్చారు. మొత్తంగా ఐదు కేటగిరీల్లో 106 స్థానాలు ఉన్నాయి.
