Annadata Sukhibhava : రైతుల ఖాతాల్లో రూ.7,000 జమ.. ఏపీ ప్రభుత్వ దీపావళి కానుక.. డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

Annadata Sukhibhava Status Online : ఏపీలోని రైతులకు దీపావళి కానుకగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులను కూటమి ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది.

andhra pradesh releases annadata sukhibhava diwali fund check status online

Annadata Sukhibhava Status: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు కూటమి ప్రభుత్వం దీపావళి పండగ సందర్భంగా తీపి కబురు అందించింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి విడుదల చేసిన నిధులు ప్రస్తుతం అకౌంట్లలో జమ అవుతున్నాయి. పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,000 తో పాటు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5,000 కలిపి మొత్తం ఒకేసారి రూ.7,000 రైతుల ఖాతాల్లో డిబిటి ద్వారా పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ ప్రభుత్వం రూ.2,234.03 కోట్లను విడుదల చేసింది.

Read Also – AP Municipal Elections: విజయవాడ 55వ డివిజన్‌లో షాక్.. బ్యాలెట్ పేపర్లలో మారిన పోటి గుర్తులు.. పోలింగ్ నిలిపివేత!

ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసే విధానం.. ఆధార్ నంబర్‌తో సులువుగా తెలుసుకోండి:

డబ్బులు అకౌంట్లో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి రైతులు అధికారిక పోర్టల్ annadathasukhibhava.ap.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. హోమ్‌పేజీలో ఉన్న ‘నో యువర్ స్టేటస్’ (Know Your Status) ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ 12 అంకెల ఆధార్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అనంతరం ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడంతో మీ ఖాతాలో తాజా విడత సొమ్ము జమ అయిందో లేదో వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిధుల బదిలీ ప్రక్రియ దశలవారీగా జరుగుతుండటంతో కొంతమందికి ఖాతాల్లో జమ కావడానికి స్వల్ప సమయం పట్టవచ్చు.

నిధులు జమ కాకపోతే ఏం చేయాలి? కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పరిష్కారాలు:

ఒకవేళ మీ అకౌంట్‌లో డబ్బులు పడకపోతే కంగారు పడకుండా ముందుగా బ్యాంక్ స్టేట్‌మెంట్, బ్యాంక్ కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తయిందో లేదో సరిచూసుకోవాలి. దాంతో పాటు బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింకింగ్, ఎన్‌పీసీఐ (NPCI) మ్యాపింగ్ కాకపోతే నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు వెంటనే సంబంధిత బ్యాంకును లేదా స్థానిక రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్‌కే), గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. కాగా, ఈ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా కేంద్ర-రాష్ట్ర వాటాలతో కలిపి రైతులకు మొత్తం రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తోంది.