Ap Covid
AP Covid : ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు పెరిగాయి. నిన్న 809 కేసులు నమోదవగా, తాజాగా 865 కేసులు నమోదయ్యాయి.
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50వేల 463 శాంపుల్స్ ని పరీక్షించగా 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 172 కేసులు కేసులు వెలుగుచూశాయి. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళంలో నాలుగు కేసుల చొప్పున నమోదయ్యాయి.
ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!
రాష్ట్రంలో గత 24 గంటల్లో మరో 9 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 14,195కి చేరింది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాజిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు మరణించారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
అనంతపురం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 168, తూర్పుగోదావరి జిల్లాలో 172, గుంటూరు జిల్లాలో 117, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 75, కర్నూలు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 75, ప్రకాశం జిల్లాలో 90, శ్రీకాకుళం జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 35, విజయనగరం జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?
తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,998కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 20,27,229 మంది కోలుకున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,88,196 మంది, చిత్తూరు జిల్లాలో 2,40,616 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 1,424 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,574కి తగ్గింది. రాష్ట్రంలో అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24, అనంతపురం జిల్లాలో 77 విజయనగరం జిల్లాలో 68, శ్రీకాకుళం జిల్లాలో 121, విశాఖపట్నంలో 225, కడప జిల్లాలో 289 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో తాగా నిర్వహించిన 50,304 నిర్వహించిన టెస్టులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన శాంపిల్స్ సంఖ్య 2,84,00,471కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సగటున 40 వేల నుంచి 50వేల వరకు కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.
#COVIDUpdates: 02/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,49,103 పాజిటివ్ కేసు లకు గాను
*20,24,334 మంది డిశ్చార్జ్ కాగా
*14,195 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,574#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/wEepV1d2vX— ArogyaAndhra (@ArogyaAndhra) October 2, 2021