Andhra Pradesh: దేశంలో బెస్ట్ గవర్నెన్స్ అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ)ఈ విషయాన్ని పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ – 2020లో ర్యాంకింగ్ తో సహా పేర్కొంది. ఈ మేరకు 0.531 పాయింట్లు దక్కించుకుంది. కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఈక్విటీ, ఎదుగుదల, ఎదగడానికి గల సామర్థ్యం అనే అంశాలపై రిపోర్టు రెడీ చేశారు. రెండు కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, రెండు కోట్ల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల అనే రెండు క్యాటగిరీలను డివైడ్ చేసి రిపోర్ట్ రెడీ చేశారు.
పెద్ద రాష్ట్రాల క్యాటగిరీలో కర్ణాటక పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ 0.468గా ఉంది. ఇందులో కేరళ టాప్‌గా 1.388 పాయింట్లతో ఉంది. చిన్న రాష్ట్రాల క్యాటగిరీలో గోవా 1.745 పాయింట్లతో టాప్‌గా, ఆ తర్వాత మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలు ఉన్నాయి.
పీఏసీ ఛైర్మన్ కే కస్తూరిరంజన్ మాట్లాడుతూ.. ఒక్కో రాష్ట్రం ఒక్కో అంశంలో టాప్‌గా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కేరళ గవర్నమెంట్ సబ్‌మిట్ చేసిన డేటాలో హెల్త్, గవర్నెన్స్, చిల్డ్రన్, మాన్యూట్రిషన్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్, ఇన్‌ఫ్రాస్టక్చర్, రిసోర్సెస్, జెండర్ ఈక్వాలిటీ అనే అంశాలు రాజకీయంగా, అడ్మినిస్ట్రేటివ్ పార్టిసిపేషన్ లోనూ మెరుగ్గా ఉన్నాయని నీతి అయోగ్ రిపోర్ట్ చెప్పినట్లుగా పేర్కొంది.
కేరళ ఎదుగుదలలో ఫస్ట్ ర్యాంక్ లో ఉండగా, ఈక్విటీలో మాత్రం రెండో స్థానంలో ఉంది. ఈ పరిగణనలో 18పెద్ద రాష్ట్రాలు, 11చిన్న రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.