Special trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకి ప్రత్యేక రైళ్లు.. రూట్స్ ఇవే.. బుకింగ్ ఓపెన్ ఎప్పుడంటే

Special trains : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Special trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకి ప్రత్యేక రైళ్లు.. రూట్స్ ఇవే.. బుకింగ్ ఓపెన్ ఎప్పుడంటే

Special Trains

Updated On : September 14, 2025 / 9:07 AM IST

Special trains : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ లో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Also Read: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు.. దరఖాస్తుల స్వీకరణ

పండుగ నేపథ్యంలో వివిధ రైల్వే మార్గాల్లో అదనపు రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లను 22వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు నడపడం జరుగుతుందని చెప్పారు. నాందేడ్ – సీఎస్ ముంబయి, చర్లపల్లి – తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నాందేడ్ – సీఎస్ ముంబయి మార్గంలో నాలుగు సర్వీసులు, చర్లపల్లి – తిరుపతి మార్గంలో 16 సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.

అక్టోబర్ 5వరకు ప్రత్యేక రైళ్లు..
ఇప్పటికే.. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే. చర్లపల్లి – అనకాపల్లి మధ్య సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

చర్లపల్లి – అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడుస్తుంది. అదేవిధంగా అనకాపల్లి – చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.

52 ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి – అనకాపల్లె – తిరుపతి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా.. ఈనెల 17 నుంచి నవంబరు 26వ తేదీ వరకు (బుధవారం) సంబల్‌పూర్ – ఇరోడ్ (08311) మధ్య 11 రైళ్లు. అదేవిధంగా ఈనెల 19 నుంచి నవంబరు 28వరకు (శుక్రవారం) ఇరోడ్ – సంబల్ పూర్ (08312)మధ్య 11 రైళ్లు. ఈనెల 15వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు (సోమవారం) విశాఖ పట్టణం – తిరుపతి మధ్య 11 రైళ్లు. ఈ నెల 16వ తేదీ నుంచి నవంబరు 25వ తేదీ వరకు (మంగళవారం) తిరుపతి – విశాఖపట్టణం (08584) మధ్య 11 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.