మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు.. దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఇందుకు సంబంధించిన కమిటీ దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు.. దరఖాస్తుల స్వీకరణ

Singareni

Updated On : September 13, 2025 / 4:38 PM IST

Singareni: సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు కూడా పనిచేయనున్నారు. మహిళా జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.

ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆపరేటర్లుగా మహిళలను ఎంపిక చేయనున్నారు. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు మైనింగ్ లో మహిళాసాధికారత దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే?

ఏడో తరగతి పాసైన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతికి, జనరల్ మేనేజర్ కు అందజేయాలని సింగరేణి ఓ ప్రకటనలో తెలిపింది.

దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఇందుకు సంబంధించిన కమిటీ దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.