Singareni
Singareni: సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లు కూడా పనిచేయనున్నారు. మహిళా జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.
ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆపరేటర్లుగా మహిళలను ఎంపిక చేయనున్నారు. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు మైనింగ్ లో మహిళాసాధికారత దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే?
ఏడో తరగతి పాసైన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతికి, జనరల్ మేనేజర్ కు అందజేయాలని సింగరేణి ఓ ప్రకటనలో తెలిపింది.
దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఇందుకు సంబంధించిన కమిటీ దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.