Thalliki Vandanam Scheme: తల్లికి వందనం.. అకౌంట్లో రూ.15వేలు పడేది ఎప్పుడో తెలిసిపోయింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘తల్లికి వందనం(Thalliki Vadanam)’ పథకం అమలుకు సన్నాహాలు వేగం పుంజుకున్నాయి.

Andhra pradesh talliki vandanam scheme to benefit 68 lakh students from july

  • జులైలో తల్లికి వందనం ప్రారంభం
  • 68 లక్షల విద్యార్థులకు లబ్ధి
  • రూ.9 వేల కోట్ల వ్యయం

Thalliki Vandanam: పాఠశాల విద్యను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం అమలుకు సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

*Fig Fruit: ప్రపంచంలో తొలి సాగు చేసిన పండు ఇదే.. 11 వేల ఏళ్ల చరిత్ర.. యాపిల్ కాదు, అసలు నిజం తెలిస్తే షాక్!

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జులై మొదటి వారంలోనే ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 68 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కుటుంబంలో ఒక్క విద్యార్థికే పరిమితమైన లబ్ధిని, ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వర్తించేలా మార్పులు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో పథకం అమలుకు అవసరమైన నిధులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘తల్లికి వందనం’ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే దాదాపు రూ.9 వేల కోట్ల వరకు వ్యయం కావొచ్చని అధికారులు గుర్తించారు. దీంతో నిధుల సమీకరణ, అర్హుల గుర్తింపు, అమలు విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలియడంతో విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.