AP Weather Update : బాబోయ్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన!

AP Weather Update : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.

AP Weather Update

  • ఏపీ వైపు అల్పపీడనం పయనం..
  • కోస్తా, రాయలసీమకు వర్ష హెచ్చరిక
  • బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం..

AP Weather Update : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీని కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

3 నుంచి 4 రోజుల్లో బలపడే ఛాన్స్ :
వాతావరణ అంచనాల ప్రకారం.. కొత్తగా ఏర్పడే అల్పపీడనం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బలపడవచ్చు. అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలులు వేగంగా వీచడంతో పాటు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.

Read Also : Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ధమాకా.. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిపై 80శాతం తగ్గింపు..!

వాయుగుండంగా మారుతుందా? :
ఈ అల్పపీడనం ఎంత బలపడుతుందనే అంశంపై వాతావరణ నమూనాలు వేర్వేరు అంచనాలను ఇస్తున్నాయి. కొన్ని నమూనాల ప్రకారం.. బుధవారం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చు. మరికొన్ని అంచనాల ప్రకారం.. సాధారణ అల్పపీడనంగానే కొనసాగుతూ తీర ప్రాంతాల వైపు కదలవచ్చు. దీని తీవ్రత, ప్రయాణ దిశపై రాబోయే 24 నుంచి 48 గంటల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మత్స్యకారులకు కీలక సూచనలివే :
సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ సముద్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. చేపల వేటకు వెళ్లే ముందు అధికారుల సూచనలు పాటించాలి.

స్థానిక అధికార యంత్రాంగం కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా? ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షం కురుస్తుందనే విషయాలపై వాతావరణ శాఖ అతి త్వరలో వెల్లడించనుంది.