AP 2026 10th Results : పదో తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే..

AP 2026 10th Results : పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్.. రిజల్ట్స్ పై అప్డేట్ వచ్చేసింది.

ap 10th class public examination answer sheets evaluation starts from april 4 to 13 results will in third week

AP 2026 10th Results :

రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి బోర్డు పరీక్షలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం అయ్యాయి. ఇవి ఏప్రిల్ 2న ముగుస్తున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తుండగా.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభించనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 4 నుంచి 13 వరకు.. మొత్తం 10 రోజుల్లో జవాబు పత్రాల కరెక్షన్ పూర్తి చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు. వీటి ప్రకారం..

  • రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు.
  • ఏప్రిల్ 4-13 వరకు 10 రోజుల పాటు ఈ మూల్యాంకనం నిర్వహించనున్నారు.
  • ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు ఒక రోజుకు 40 జవాబు పత్రాలను కరెక్షన్ చేయడానికి ఇస్తారు.
  • వీటిలో ఉదయం 20, మధ్యాహ్నం నుంచి 20 చొప్పున 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
  • మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. భారీగా జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఆదేశాలు జారీ చేసింది.
  • మార్కులను మాన్యువల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేయాలి.
  • ఇంటర్, పదో తరగతి.. రెండు తరగతులకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు.
  • మార్కుల లెక్కింపులో పొరపాట్లు లేకుండా చూసేందుకు గాను ఈ సంవత్సరం ట్యాబ్‌లను తీసుకొచ్చారు.
  • గత సంవత్సరం మార్కుల మూల్యాంకనంలో పొరపాట్లు జరగడంతో ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
  • 10 రోజుల్లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేసి.. ఏప్రిల్‌ మూడో వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది.
  • గతేడాది ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.