చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ..
- Harishth Thanniru
- Published On : June 11, 2024 / 01:14 PM IST
Chandrababu Will Took Oath as CM : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షాతోపాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.
Also Read : చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం ..
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరంకు చిరంజీవి వెళ్లనున్నారు. విజయవాడంలో రాత్రి బసచేసి ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోనున్నారు. పవన్ కల్యాణ్ కూడా రేపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం నేపథ్యంలో చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆయనకు ఎంపీ సీటు ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది: చంద్రబాబు
మరోవైపు ఇవాళ రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 11గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
