CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు కీలక హెచ్చరిక.. పోటీ చేస్తే కఠిన చర్యలు.. ఉండవల్లిలో సీఎం సంచలన కామెంట్స్!

స్థానిక ఎన్నికల్లో బి-ఫారమ్ పొందిన కూటమి అభ్యర్థులే బరిలో ఉండాలని, రెబల్స్‌గా పోటీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించారు.

Ap cm chandrababu naidu press meet on local body elections and nda rebels warning

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో కూడిన పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సంబంధించి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ధరిస్తూ మరిన్ని సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, ప్రభుత్వ ముద్రణతో కూడిన అధికారిక పాస్ పుస్తకాలను అందించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం చేపట్టిన విధ్వంసం, నిధుల మళ్లింపు వల్లే స్థానిక సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.

Revanth-Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక చర్చలు

గత పాలనపై చంద్రబాబు ధ్వజం.. ‘చెప్పాము.. చేస్తున్నాం.. చేస్తాం’ నినాదంతో ప్రజాక్షేత్రంలోకి కూటమి:

స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైకాపా కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి (CM Chandrababu)ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగకపోతే కేంద్ర నిధులు రాక స్థానిక ప్రాంతాల అభివృద్ధి స్తంభించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు భయపడిన పరిస్థితుల నుంచి.. నేడు కుప్పం, పిఠాపురం, పులివెందుల వంటి సున్నిత ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛగా నామినేషన్లు పడుతున్నాయని చెప్పారు. ‘వెల్ఫేర్, డెవలప్‌మెంట్, సర్వీస్, గుడ్ గవర్నెన్స్’ సూత్రంతో ముందుకు వెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

రెబల్స్‌కు కఠిన హెచ్చరికలు.. బి-ఫారం పొందిన వారికే కూటమి పూర్తి మద్దతు:

స్థానిక సమరంలో కూటమి తరఫున బి-ఫారం సాధించిన అభ్యర్థులే అధికారికంగా బరిలో ఉంటారని సీఎం స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై సాయంత్రంలోగా శ్రేణులకు సంపూర్ణ స్పష్టత వస్తుందన్నారు. పార్టీ అధికారిక నిర్ణయాన్ని కాదని రెబల్స్‌గా నామినేషన్లు వేస్తే వారిపై పార్టీ పరంగా కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశావహులందరూ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల కంటే కూడా స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎన్‌డీఏని గెలిపించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.