CM Jagan Good News : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ ఫైల్‌పై జగన్ సంతకం
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Naveen
- Published On : June 6, 2022 / 07:36 PM IST
Cm Jagan Good News
CM Jagan Good News : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. జూన్ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ లేదా రేపు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ట్రాన్సఫర్లకు సీఎం జగన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని వెయిట్ చేశారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడింది. బదిలీలకు సీఎం జగన్ పచ్చజెండా ఊపారు.
బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై త్వరలోనే క్లారిటీ రానుంది. బదిలీలకు సంబంధించి అధికారుల నుంచి సీఎం జగన్ కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకు సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధారణ బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. దీంతో సాధారణ బదిలీలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో త్వరలోనే సాధారణ ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.
