Pawan Kalyan: సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి చెక్.. డిప్యూటీ సీఎం ఆఫీస్‌లో ప్రత్యేక విభాగం.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
- V Santhosh Kumar
- Published on- July 1, 2026 / 08:52 PM IST
AP Deputy CM Pawan Kalyan sensational comments regarding social media abuse and personal attacks
- వాక్ స్వాతంత్ర్యం అపరిమితం కాదు.
- సోషల్ మీడియా దుర్వినియోగం తగదు.
- చట్టపరమైన చర్యలు తప్పవు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమితమైన హక్కు కాదని, దానికి కూడా కొన్ని నిర్దిష్టమైన పరిమితులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అడ్డగోలు విమర్శలు, అసభ్యకర పోస్టులపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకరి హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వాక్ స్వాతంత్ర్యం వెళ్లినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అలాంటి వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరికాదన్నారు.
సోషల్ మీడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఒక కీలక అడుగు వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా, సోషల్ మీడియాలో వేధింపులు, దుర్వినియోగానికి సంబంధించిన బాధితుల ఫిర్యాదులను నేరుగా స్వీకరించేలా ఏపీ డిప్యూటీ సీఎం(Pawan Kalyan) కార్యాలయం (ఆఫీసు) లో ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా బాధితులకు అండగా ఉంటూ, తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
