Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై లోకేశ్ సమీక్ష.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే..
Thalliki Vandanam : ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది.
- Harish Thanniru
- Updated on- June 16, 2026 / 05:45 PM IST
Thalliki Vandana Scheme
- తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్
- అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష
- నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
Thalliki Vandanam : ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిధుల విడుదలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు లోకేశ్ కీలక సూచనలు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతీయేటా రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీయేటా ఒక్కో విద్యార్థికి రూ.15వేలు విడుదల చేస్తోంది. ఇందులో రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతుండగా.. రూ.2వేలు పాఠశాలల మెయింటెనెన్స్ ఖర్చుల కింద జమ అవుతున్నాయి.
వేసవి సెలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం నిధులు జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
♦ తల్లికి వందనం పథకం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది.
♦ ఇందుకోసం https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
♦ అక్కడ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, స్కీమ్ టైప్ డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం ఎంచుకోవాలి.
♦ అనంతరం ఇయర్ దగ్గర 2026-27 ఎంచుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి.
♦ ఆ తర్వాత ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో పాటు, స్క్రీన్ మీద కనిపించే క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి.
♦ అక్కడ సిటిజన్ డీటైల్స్ , ఫ్యామిలీ డీటైల్స్ , స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ అని కల్పిస్తాయి.
♦ అయితే స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ వద్ద అన్ని నిబంధనలకు Satisfied అని ఉంటే వారు తల్లికి వందనం పథకానికి అర్హులు అవుతారు.
