AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. వారందరికీ శుభవార్త.. వెంటనే ఇలా చేయండి..

AP Govt Property Tax: ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఆస్తి పన్నుకు సంబంధించి బంపరాఫర్ ప్రకటించింది.

Chandrababu Naidu

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేవారికి 5శాతం రాయితీ
  • మే 1నుంచి 31 వరకు అవకాశం

AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఆస్తి పన్నుకు సంబంధించి బంపరాఫర్ ప్రకటించింది. ఇక నుంచి గ్రామ పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను చెల్లించేవారికి 5శాతం రాయితీ తొలిసారిగా ప్రకటించారు. మే1వ తేదీ నుంచి మే 31లోపు పన్ను చెల్లించేవారికి ఈ రాయితీ ఉంటుంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Also Read :  తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లే ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించే వారికి రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూరనుంది. గతంలో కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా వర్తింపజేయనుండటం గమనార్హం.

2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే 1 నుంచి 31లోపు పన్ను చెల్లించేవారికి ఈ 5శాతం రాయితీ ఇస్తారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది. ఏపీ ప్రజలు మే 1 నుంచి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా వారి ఆస్తి పన్ను చెల్లించొచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ సూచించారు.

ఇదిలాఉంటే.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్థి పన్నుకు సంబంధించి రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీలోగా 2026-27కు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5శాతం రిబేట్ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లించేవారికి రాయితీ తగ్గించి వసూలు చేయనున్నారు. మరోవైపు 2025-26 సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై కూడా ఏపీ ప్రభుత్వం 50శాతం వడ్డీ మాఫి చేస్తోంది. దీనికి కూడా ఈ నెలాఖరు వరకు పొడిగారు. ప్రజలు పన్ను బకాయిలు నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో మాఫీ చేయనున్నారు.