AP Free Electricity: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై వారందరికీ ఉచిత విద్యుత్.. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే..
AP BC Free Electricity Scheme: ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బీసీ వర్గాల్లోని అర్హులైన వారికి ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధమైంది.
- Harish Thanniru
- Updated on- May 16, 2026 / 11:16 AM IST
AP Government Free Electricity For Bc Communities Documents Required Eligible For Application
- ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం
- బీసీ వర్గాల ప్రజలకు ఉచిత విద్యుత్
- అర్హులైన బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవచ్చు
AP Free Electricity: ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పేద వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమంకోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. రజకులు, స్వర్ణకారులు, నాయీబ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది.
వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్లు, లాండ్రీ షాపులకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, బీపీఎల్ కుటుంబాలకు 100యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. అర్హులు ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్‌తో APSPDCL AE కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అత్యంత వెనుకబడిన వర్గాల పరిధిలోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు తదితర 32 ఉప కులాలకు చెందిన లబ్ధిదారులకు ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
