AP Government: ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంకు రుణాల రీషెడ్యూల్‌.. చెల్లింపులకు ఏకంగా 5 ఏళ్ల గడువు!

ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం(AP Government), బ్యాంకింగ్ రంగం ఊరటనిచ్చే తీపి కబురు అందించాయి.

ap government slbc announces crop loan rescheduling for farmers in 380 drought affected mandals

AP Government: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం ఊరటనిచ్చే తీపి కబురు అందించాయి. ఇటీవల వర్షాభావం కారణంగా ఏపీ ప్రభుత్వం(AP Government) రాష్ట్రవ్యాప్తంగా 380 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో, ఆయా మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

Super El Nino: ఎర్రబారిన ఖగోళం.. వేడెక్కుతున్న భూమి.. 150 ఏళ్ల తర్వాత ఉగ్రరూపంలో ఎల్నినో.. వాతావరణ శాఖ భయంకర హెచ్చరిక!

380 కరవు మండలాల్లో వర్తింపు.. 60 నెలల వరకు గడువు పొడిగింపు:

ఈ రీషెడ్యూల్ నిర్ణయం కరవు ప్రభావిత ప్రాంతాల్లో అక్టోబర్ నాటికి ‘స్టాండర్డ్ కేటగిరీ’లో ఉన్న రైతు రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని మండలాలతో పాటు ఇతర కరువు మండలాల్లోని రైతులకు రుణాలు చెల్లించేందుకు ఏకంగా 60 నెలల (5 ఏళ్ల) సుదీర్ఘ గడువును పొడిగించారు. దీనివల్ల బ్యాంకర్ల నుంచి ఎలాంటి రికవరీ ఒత్తిడి లేకుండా రైతులకు బిగ్ రిలీఫ్ లభించనుంది.

అగ్రికల్చర్, అనుబంధ రంగాల లోన్లకు వెసులుబాటు:

ఈ రుణ రీషెడ్యూల్ కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ, పట్టు పెంపకం, అగ్రో/ఆహార శుద్ధి యూనిట్లకు తీసుకున్న రుణాలకు కూడా విస్తరించనుంది. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవతో బ్యాంకర్లు ఈ వెసులుబాటు కల్పించడంతో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగానికి పునరుజ్జీవం లభించినట్లయింది.