Dwcra Women: ఏపీ డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే బ్యాంకు లోన్లు.. రాయితీపై ఈ-ఆటోలు, ఈ-స్కూటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల (Dwcra Women)ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Ap government subsidized e autos and e scooters to dwcra women
- డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్
- సబ్సిడీపై ఈ-ఆటోల పంపిణీ
- తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు
Dwcra Women: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు, సొంతంగా ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూనే, మహిళలకు(Dwcra Women) ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను (ఈ-ఆటోలు, ఈ-స్కూటీలు) అందించే దిశగా మెప్మా ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Ktr: పేరుందని పథకాలు ఆపేస్తారా? అధికారం శాశ్వతం కాదు.. కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఫైర్
రూ.లక్ష రాయితీతో ఈ-ఆటోలు, సులభ వాయిదాలలో బ్యాంకు రుణాలు:
ఈ పథకం కింద రూ.4.5 లక్షల విలువైన ఈ-ఆటోను ప్రభుత్వం ఏకంగా రూ.లక్ష సబ్సిడీతో రూ.3.5 లక్షలకే అందిస్తోంది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల భారీ వడ్డీల భారం లేకుండా, బ్యాంకులతో తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తూ సులభ కంతుల రూపంలో చెల్లించే సౌకర్యం కల్పిస్తోంది. ఈ ఆటోలను డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందే వెసులుబాటు ఉంది. గతంలో కొంతమందికి సబ్సిడీ ఆటోలు అందించగా, ప్రస్తుతం మరింత మందికి ఈ ప్రయోజనం చేకూర్చేందుకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ-స్కూటీలకు రూ.12 వేల సబ్సిడీ:
ఈ-ఆటోలతో పాటు మహిళల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ స్కూటీల కొనుగోలుపై కూడా రూ.12,000 రాయితీని, తక్కువ వడ్డీ బ్యాంకు రుణ సదుపాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రస్తుతం పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై అవగాహన తక్కువగా ఉన్నందున, అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా మెప్మా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఆసక్తి కలిగిన డ్వాక్రా సభ్యులు వెంటనే సమీప మెప్మా అధికారులను సంప్రదించి అప్లై చేసుకోవచ్చని సూచించారు.
