Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు ఈసారి వారికి మాత్రమే.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి..

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం కింద గత రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ.6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు మరో రూ.2,808 కోట్లు జమ చేయనుంది. మొత్తం రూ.9,111 కోట్లు సాయాన్ని రైతులకు ఏపీ ప్రభుత్వం అందించినట్లు అవుతుంది.

Annadata Sukhibhava

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • అర్హులైన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు
  • లిస్ట్‌లో మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి

Annadata Sukhibhava : ఉగాది పండుగ వేళ రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 4వేలను, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు మొత్తం రూ.6వేలు ఏపీలోని రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈనెల 13వ తేదీన అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది.

Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. వారంరోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ.. రైతులకు కీలక సూచన

మార్చి 13న అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. అదేరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

రైతులకు సాగు సమయంలో ఆర్థిక సాయం కింద ప్రతీయేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతల్లో రూ.20వేలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు మూడు విడతల్లో జమ చేస్తుండగా.. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14వేలను మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా మొత్తం మూడు విడతల్లో మూడు దఫాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏపీలో 46.80లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతుండగా.. దేశవ్యాప్తంగా సుమారు 10లక్షల మంది రైతులు పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. గత రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ.6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు మార్చి 13న రూ.2,808 కోట్లు జమ చేయనుంది. మొత్తం రూ.9,111 కోట్లు సాయాన్ని రైతులకు ఏపీ ప్రభుత్వం అందించినట్లు అవుతుంది.

అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి అక్కడ చెక్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. ఈ మేరకు రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి పక్కనే ఉండే కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హులైన వివరాలు కనిపిస్తాయి.