ఆ కులం పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో నిర్ణయం..
దొమ్మర వర్గానికి చెందిన వారిని అవమానించేలా కొంతమంది దూషణ పదాలు ఉపయోగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.
- T Venkateshwarlu
- Updated on- November 29, 2025 / 09:57 PM IST
Andhra Pradesh: దొమ్మర కులం పేరును దొర వంసగామార్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జాబితాలో ఉన్న “దొమ్మర” కులపేరును “దొర వంస (Dommara)”గా మార్చడానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1970లో జారీ చేసిన అప్పటి జీవో ప్రకారం “దొమ్మర” అనే వర్గం BC-A గ్రూప్‌లో ఉంది.
Also Read: పవన్ కల్యాణ్, లోకేశ్ ఫుల్ క్లారిటీ.. సింగిల్ ఫొటోతో అన్నింటికి ఫుల్ స్టాప్?
కొంతమంది ప్రజలు దొమ్మర వర్గానికి చెందిన వారిని అవమానించేలా దూషణ పదాలు ఉపయోగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ పేరును మార్చింది.
కొత్తగా చేసిన సవరణ బీసీ ఏ జాబితాలో Sl.No.7 వద్ద ఇప్పుడు Dora Vamsa (Dommara)గా ఉంటుంది. కుల ధ్రువపత్రాలలో దొర వంస అని మాత్రమే రాయాలి.
