AP Deepam 2 Scheme: దీపం-2 పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ప్రతినెలా ఆ తేదీనే డబ్బులు.. ప్రభుత్వం కొత్త ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దీపం-2(AP Deepam 2 Scheme)’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే.

ap govt changes deepam 2 free cylinder subsidy deposit process

  • దీపం-2 రాయితీ మార్పు
  • ఫిక్స్‌డ్ డేట్‌కే నగదు
  • కోటి కుటుంబాలకు లబ్ధి

AP Deepam 2 Scheme: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దీపం-2(AP Deepam 2 Scheme)’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సిలిండర్ తీసుకున్న తర్వాత రాయితీ సొమ్ము ఎప్పుడు ఖాతాలో జమ అవుతుందో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.2,900 కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రచారం లభించడం లేదని భావించిన పౌరసరఫరాల, ఆర్థిక శాఖ అధికారులు రాయితీ జమ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

Onion Price Hike: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిధర.. ఏడాదిలోనే 94 శాతం పెరుగుదల.. కిలో ఎంత ఉందో తెలుసా?

డెలివరీ తర్వాతే సబ్సిడీ.. కొత్త విధానం ఇదే:

ప్రస్తుత విధానంలో గ్యాస్ కంపెనీల ద్వారా సబ్సిడీ జమ కావడం వల్ల లబ్ధిదారులకు స్పష్టత ఉండటం లేదు. కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఏ నెలలో సిలిండర్ డెలివరీ తీసుకుంటే, ఆ తర్వాత నెలలోని ఒక నిర్ణీత తేదీన నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రాయితీ సొమ్మును జమ చేయనున్నారు. ఉదాహరణకు సెప్టెంబరులో సిలిండర్ తీసుకుంటే అక్టోబరులోని ఒక ఫిక్స్డ్ డేట్‌న క్యాష్ బ్యాక్ అవుతుంది. ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’ తరహాలోనే కచ్చితమైన తేదీని ముందే ప్రకటించనున్నారు.

కోటి మందికి ప్రయోజనం.. భారీగా లబ్ధిదారులు:

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.61 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో ఉజ్వల, దీపం-1, సాధారణ పేదల కనెక్షన్లు కలిపి ప్రతీ విడతకు సుమారు 92 లక్షల నుండి కోటి మంది వరకు ఉచిత సిలిండర్ల సబ్సిడీని పొందుతున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సార్లు ఈ సబ్సిడీ సాయం అందుతోంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ కొత్త డిపాజిట్ తేదీల విధానంతో కోట్లాది మంది లబ్ధిదారులకు మరింత పారదర్శకత, సౌలభ్యం లభించనుంది.