Deepam 2 Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ‘దీపం 2.0’ అర్హతలు, వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌ పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 'దీపం 2.0' (Deepam 2 Scheme)పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.

ap govt deepam 2 scheme free lpg gas cylinders eligibility apply process

  • ఏపీ ప్రజలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
  • సర్కార్ కీలక సూచనలు
  • ఫిర్యాదులకు 1967 టోల్ ఫ్రీ

Deepam 2 Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ‘దీపం 2.0′(Deepam 2 Scheme) పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. పెరుగుతున్న వంటగ్యాస్ ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తోంది. గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన 48 గంటల్లోనే సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.

Madhya Pradesh Baby: 4 చేతులు, 4 కాళ్ళతో.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వింత‌శిశువు జ‌న‌నం.. వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం

అర్హతలు, కావలసిన పత్రాలు:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, 18 ఏళ్లు నిండి ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ మూడూ ఒకే వ్యక్తి పేరుపై ఉండి, బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ (NPCI మ్యాపింగ్) అయి ఉండాలి. దరఖాస్తు కోసం ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. సమీప గ్రామ/వార్డు సచివాలయం లేదా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు ఫారం పూర్తి చేసి వీటిని సమర్పించవచ్చు.

ఒకవేళ సబ్సిడీ జమ కాకపోతే ఏం చేయాలి?

ఒకవేళ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత కూడా ఖాతాలో డబ్బులు జమ కాకపోతే, ముందుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్‌పీసీఐ (NPCI) మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయినప్పటికీ ఇంకా సమస్య కొనసాగుతుంటే, టోల్ ఫ్రీ నంబర్ 1967 ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.