AP Government: ఏపీ భవన యజమానులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ నిబంధనల్లో భారీ మార్పులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఏపీలో భవనాలకు(AP Government) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ, తనఖా ఆస్తుల విడుదల ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది.
- V Santhosh Kumar
- Published on- October 16, 2026 / 08:06 PM IST
Ap govt simplifies occupancy certificate and mortgage property release process
AP Government: ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో భవనాలు నిర్మించే యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపాలిటీల పరిధిలో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పొందాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (AP Government) జారీ ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా మున్సిపల్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.
తనఖా ఆస్తుల విడుదల ఆన్లైన్లోకి.. సులభంగా సేవలు:
భవన నిర్మాణ అనుమతుల సమయంలో స్థానిక సంస్థల వద్ద తనఖా పెట్టిన 10 శాతం ఆస్తుల విడుదల ప్రక్రియలో కూడా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటలైజ్ చేస్తూ, పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనివల్ల భవన యజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చాలా సులభంగా, వేగంగా తమ తనఖా ఆస్తులను విడిపించుకోవడానికి మార్గం సుగమమైంది.
పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ:
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం భవన యజమానులపై నిబంధనల భారం తగ్గి, వేధింపులు లేని సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగం మరింత పుంజుకోవడమే కాకుండా, ప్రజలకు సకాలంలో అనుమతులు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
