AP New Pension 2026 : ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జూన్ 12 నుంచి వారి ఖాతాలో ప్రతి నెలా రూ.4 వేలు
AP New Pension 2026 : ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 12 నుంచి వారి ఖాతాలో రూ. 4 వేలు జమ కానున్నాయి.
- Dharani Pilli
- Updated on- May 23, 2026 / 03:07 PM IST
Ap Govt to Issue New Widow Pensions from June 12 Under NTR Bharosa Scheme rs 4000 per month
- ఏపీ ప్రజలకు శుభవార్త
- జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు
- వితంతువులకు నెలకు రూ.4 వేలు
AP New Pension 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల జారీపై శుభవార్త చెప్పింది. జూన్ 12 నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రమంలో వితంతువులకు శుభవార్త చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్లు జారీ చేసేందుకు సర్కార్ ఆమోదం తెలిపిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో ఇకపై వితంతువులకు ప్రతి నెలా వారి ఖాతాలో రూ. 4 వేలు నేరుగా జమ కానున్నాయి. 2026, జూన్ 12 నుండి కొత్త పింఛన్లను జారీ
* కొత్తగా 10లక్షల పెన్షన్లు, 5వేల పోస్టులు భర్తీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పింఛను పొందాలనుకునే అభ్యర్థులు రూపాయి ఖర్చు చేయకుండా.. ఉచితంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఏమేం పత్రాలు కావాలి.. ఎలా దరఖాస్తు చేయాలనే వివరాలు..
కొత్తగా వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలంటే..
- ఆధార్ కార్డ్,
- వైట్ రేషన్ కార్డ్,
- భర్త మరణ ధృవీకరణ పత్రం,
- కులం ధ్రువీకరణ సర్టిఫికేట్,
- ఇన్ కమ్ సర్టిఫికేట్,
- వంటి డాక్యుమెంట్లు కచ్చితంగా అవసరం.
ఎలా దరఖాస్తు చేయాలంటే
- కొత్తగా వితంతు పింఛనుకు దరఖాస్తు చేయాలని భావించే వారు.. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి..
- పింఛనుకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన దరఖాస్తు ఫారం తీసుకోవాలి.
- దానిలో అడిగిన అన్ని వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
- అనంతరం అధికారులు పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు.
- లబ్ధిదారుల జాబితాలో చేర్చిన తర్వాత మీకు పింఛన్ ప్రతీ నెలా అందిస్తారు.
- భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛన్ అందిస్తారు.
- వితంతు పింఛన్ పొందేందుకు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.
వీరికి పింఛను రాదు..
అయితే ఇక్కడ పేర్కొన్న అర్హతలు ఉన్న వారికి వితంతువు పింఛను రాదు. వారు ఎవరంటే..
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే పింఛను రాదు.
- ఇక కుటుంబంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు.
నెలకు రూ. 15 వేలు
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తుంది. దీని ద్వారా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, నేత, గీత కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ ఇస్తుంది. కేటగిరీ బట్టి నెలకు రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు లబ్ధిదారుల ఖాతాలో పింఛను మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు పింఛన్ అందిస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది అందిస్తున్నారు. ఒకవేళ ఫస్టు తారీఖు ఆదివారం లేదా పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు.
