Ap Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్లు, పోలింగ్ తేదీల పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు(Ap Panchayat Elections) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Ap gram panchayat elections first phase notification released

Ap Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఒక్కసారిగా మొదలైంది. రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతూ నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం స్పష్టంగా వెల్లడించింది.

Egg Prices Hike: సామాన్యులకు కోడిగుడ్డు షాక్.. భారీగా పెరిగిన ధరలు.. ఏకంగా రూ.16కి చేరింది

నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ.. 21న తుది జాబితా:

ఎన్నికల షెడ్యూల్(Ap Panchayat Elections) ప్రకారం తొలి విడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 15న ప్రారంభమై, నవంబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నవంబర్ 18న అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, తిరస్కరణకు గురైన అభ్యర్థులు నవంబర్ 19, 20 తేదీల్లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం నవంబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.

నవంబర్ 26న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి:

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 26న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ నిలిచిపోయినా లేదా రద్దయినా, అలాంటి కేంద్రాల్లో నవంబర్ 27న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.