AP Inter Summer Holidays 2026 : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..!

AP Inter Summer Holidays 2026 : ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. ఆ వివరాలు..

ap intermediate board announces summer holidays 2026 for second year students

AP Inter Summer Holidays 2026 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. వేసవి సెలవులపై ప్రకటన చేసింది. దీంతో పాటు 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. ఫస్టియర్ పూర్తి చేసుకుని సెకండియర్‌లో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుండి ఏప్రిల్ 23 వరకు ఇంటర్ సెకండియర్ క్లాసులు నిర్వహిస్తారు.

ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 1న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. దీంతో పాటు ఇంటర్ విద్యార్థులకు దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఉంటాయనే దానిపై కూడా బోర్డు ప్రకటన చేసింది.

  • దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఉంటాయని ప్రకటించింది.
  • అలానే 2027, జనవరి 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.