AP Local Body Elections : ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ కొట్టివేత.. నామినేషన్ల గడువు పెంపునకు నో!

AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంచాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జిల్లా కేంద్రాల్లో నామినేషన్ల అంశంపై తాజా వివరాలు తెలుసుకోండి.

AP Local Body Elections

  • వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ..
  • నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
  • స్థానిక ఎన్నికల నామినేషన్ల వివాదం..

AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల గడువును పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానం జోక్యం చేసుకోలేదనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం (AP Local Body Elections) తీసుకుంది. దీంతో నామినేషన్ల గడువు పెంపుపై వైసీపీ చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది.

గడువు ముగిసిన పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు :
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించలేకపోయారని పేర్కొంటూ నామినేషన్ల గడువును పొడిగించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే, నామినేషన్ల గడువు ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో పిటిషన్ నిరర్థకంగా మారిందని న్యాయస్థానం పేర్కొన్నట్లు సమాచారం..

Read Also : DA Hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపుతో అక్టోబర్ జీతం ఎంత పెరుగుతుందంటే!

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాల జోక్యానికి సంబంధించి గతంలో వెలువడిన తీర్పులను కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

జిల్లా కేంద్రాల్లో నామినేషన్లకు అవకాశం? :
ఇదిలా ఉండగా, స్థానికంగా నామినేషన్లు దాఖలుకు అవకాశం లేని అభ్యర్థులు ఆయా జిల్లా కేంద్రాల్లో నామపత్రాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని వైసీపీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి, రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం..

ఈ అంశంపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఒకవైపు నామినేషన్ల గడువు పెంపు పిటిషన్ కొట్టివేత, మరోవైపు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లకు సంబంధించిన న్యాయపరమైన అంశం ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా, ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం కోర్టు పరిధిలో కీలక మలుపు తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో నామినేషన్ల అంశంపై తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది చూడాలి..