AP Local Body Elections : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు.. ఎస్ఈసీ కీలక నిర్ణయం..

AP Local Body Elections : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

AP Local Body Elections

AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్పు చేసింది. వాస్తవానికి నవంబర్ 3వ తేదీన నిర్వహించాల్సిన పోలింగ్ తేదీని 5వ తేదీకి మార్పు చేసింది. ఓట్ల లెక్కింపు 5వ తేదీ నుంచి 7వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటన విడుదల చేసింది.

Also Read : Cm Chandrababu: ‘అర్నబ్’ తుపానుతో ఏపీకి భారీ నష్టం.. వెంటనే కేంద్ర బృందాలను పంపండి.. అమిత్‌షాకు చంద్రబాబు కీలక లేఖ

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత ప్రకటించిన తేదీల ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 28వ తేదీన జరగాల్సి ఉంది. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే, మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి, ఓట్ల లెక్కింపును నవంబర్ 3వ తేదీకి మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఎన్నికల నిర్వహణ పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పులు చేస్తూ తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

తాజా ప్రకటన ప్రకారం.. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. 7వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఇదిలాఉంటే.. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని 88 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మిగతా కేంద్రాల్లో పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 1న యథావిధిగా జరుగుతుంది.