AP Local Elections : ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా.. వారం రోజుల్లో..
AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
- Dharani Pilli
- Updated on- April 8, 2026 / 05:28 PM IST
Ap local elections soon
- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ
- వారం రోజుల్లో ఎస్ఈసీ నియమాకం
- పది రోజుల్లో బీసీ జనగణన పూర్తి
AP Local Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో నేడు హైకోర్టు వీటిని విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కోర్టుకు తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే ప్రక్రియ ప్రారంభిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జనాభా లెక్కింపు తుది దశకు చేరుకుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 99.44 శాతం వివరాలు సేకరించారని.. మిగతా ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. హైకోర్టు ధర్మాసనం ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఏజీ.. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
