Municipal Election Symbol Mix Up: విజయవాడ 55వ డివిజన్‌లో షాక్.. బ్యాలెట్ పేపర్లలో మారిన పోటి గుర్తులు.. పోలింగ్ నిలిపివేత!

Municipal Election Symbol Mix Up: విజయవాడ 55వ డివిజన్‌లో ఎన్నికల (AP Municipal Elections)గుర్తులు తారుమారై బ్యాలెట్ పేపర్లు ముద్రించడంతో అధికారులు తాత్కాలికంగా పోలింగ్‌ను నిలిపివేశారు.

Vijayawada municipal elections polling halted due to ballot paper symbol mix up

Vijayawada Municipal Election Symbol Mix Up: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగుతుండగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గం ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లలో ఎన్నికల(AP Municipal Elections) గుర్తులు తారుమారు కావడం తీవ్ర తీవ్ర రాజకీయ కలకలం రేపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరుకు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ‘హస్తం’ గుర్తును, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు పక్కన వైఎస్సార్సీపీ ‘ఫ్యాన్’ గుర్తును ముద్రించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘోర పొరపాటును గుర్తించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేయడంతో, అధికారులు తక్షణమే స్పందించి 55వ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.

Read Also – Ap Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. కడప, పులివెందులలో కేంద్రాల వద్ద ఉద్రిక్తత

సరికొత్త బ్యాలెట్ పేపర్ల ముద్రణకు చర్యలు.. 2 గంటల్లో తిరిగి ఓటింగ్ ప్రారంభించే అవకాశం:

ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో ఆర్వో విడుదల చేసిన ఫారం-11 లో గుర్తులు సరిగానే ఉన్నప్పటికీ బ్యాలెట్ ముద్రణలో ఈ తప్పు దొర్లింది. సవరించిన సరైన అభ్యర్థుల పేర్లు, గుర్తులతో కొత్త బ్యాలెట్ పేపర్లను అత్యవసరంగా ముద్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల వ్యవధిలో కొత్త బ్యాలెట్లు కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఓటర్లలో ఎలాంటి గందరగోళం లేకుండా పునఃప్రారంభించి ఓటింగ్‌ను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.