AP Municipal Polls 2026 : ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మీ పట్టణం ఏ కేటగిరీలో ఉందంటే? ఫుల్ లిస్ట్!

AP Municipal Polls : ఆంధ్రప్రదేశ్‌లో 106 మున్సిపాలిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల వారీగా పట్టణాల పూర్తి జాబితా వివరాలివే..

AP Municipal Polls

  • 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఫిక్స్.. 
  • ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్..
  • మున్సిపల్ ఎన్నికల బరిలో ఎవరికి అవకాశం?
  • మున్సిపల్ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులు

AP Municipal Polls 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని 106 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌ విభాగాలతో పాటు మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను వెల్లడించింది. మొత్తం 106 పురపాలక సంఘాల్లో ఎస్టీ జనరల్‌కు 2, ఎస్టీ మహిళలకు 1, ఎస్సీ జనరల్‌కు 7, ఎస్సీ మహిళలకు 7 స్థానాలు కేటాయించారు.

బీసీ జనరల్‌ విభాగానికి 18, బీసీ మహిళలకు 18 స్థానాలు కేటాయించారు. జనరల్‌ మహిళలకు 27, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి 26 స్థానాలు ఖరారు చేశారు. ఈ రిజర్వేషన్లతో ఆయా మున్సిపాలిటీల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది.

ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు :
ఎస్టీ మహిళా కేటగిరీకి గూడూరు కేటాయించారు. ఎస్టీ జనరల్‌ స్థానాల్లో ఆత్మకూరు, ఆలూరు ఉన్నాయి. ఎస్సీ మహిళలకు కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల కేటాయించారు. ఎస్సీ జనరల్‌ జాబితాలో ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి ఉన్నాయి.

Read Also : AP Mayor Reservations : ఏపీలో మేయర్‌ స్థానాల రిజర్వేషన్లు ఫిక్స్‌.. బీసీలకు ఎన్ని సీట్లంటే? 17 నగరాల ఫుల్ లిస్ట్ ఇదే..!

బీసీ కేటగిరీ వివరాలు :
బీసీ మహిళలకు జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం కేటాయించారు.

బీసీ జనరల్‌ జాబితాలో కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు ఉన్నాయి.

జనరల్‌ మహిళలు, అన్‌రిజర్వ్‌డ్‌ :
జనరల్‌ మహిళలకు కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు కేటాయించారు.

అన్‌రిజర్వ్‌డ్‌ స్థానాల్లో పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి ఉన్నాయి.