Gudivada Amarnath : గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి
Gudivada Amarnath : వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
- Harish Thanniru
- Updated on- June 16, 2026 / 11:25 PM IST
Gudivada Amarnath vs Vangalapudi Anitha
Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్‌గా..ఏపీ పాలిటిక్స్‌లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడివాడ కామెంట్స్‌పై ఫుల్ అవడంతో..ఇష్యూ సీరియస్ పెరిగిపోయింది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మహిళా నేతను, రాష్ట్ర శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిపై చౌకబారు చిల్లర కామెంట్స్ చేయడం ఏంటని టీడీపీ అటాక్ మోడ్‌లో వెళ్తోంది. గుడివాడ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూటమి లీడర్లు వాయిస్ రేజ్ చేయడంతో అంతకంతకు రాజకీయ వేడి రాజుకుంటుంది. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు..మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో గట్టి కౌంటర్ ఇవ్వడం..ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతుండటంతో..ఈ ఫైట్ ఎటు దారితీయబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ నెల 10న హోంమంత్రి అనిత..గుడివాడను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌తో మాటల తూటాలు పేలుతూ వస్తున్నాయి. మాకు గుడ్లు పగలగొట్టడం కూడా వచ్చు అంటూ గుడివాడను ఉద్దేశించి అనిత కామెంట్స్ చేశారు. గుడివాడ లాగా తాను పకోడి బండ్లు, పానీ పూరి సెంటర్లు తేలేదని..తాను తెచ్చిన ఇండస్ట్రీలెంటో లిస్ట్ చూసి చదవడానికి గంట పడుతుందని అనిత చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు ఈ నెల 12న వైసీపీ నిరసన కార్యక్రమంలో గుడివాడ కౌంటర్ ఇచ్చారు. అనితను మేకప్ మంత్రి అంటూ సంబోధించారు గుడివాడ. ఆ తర్వాత గుడివాడను అనిత విమర్శించిన తీరును తప్పుబట్టిన వైసీసీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. మాజీమంత్రి, పైగా జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన గుడివాడను ఉద్దేశించి అలా మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రే..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని..గుడివాడకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు పుష్ప శ్రీవాణి. అంతటితో ఆ విమర్శల ఎపిసోడ్ అయిపోయిందనుకుంటే..సోషల్ మీడియాలో గుడివాడ కామెంట్స్ వైరల్ కావడంతో..టీడీపీ నేతలు ఫుల్ ఫైర్‌తో రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. దీంతో అనితను ఉద్దేశించి గుడివాడ చేసిన విమర్శలు బూమరాంగ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్‌తో..గుడివాడ కామెంట్స్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ డిస్కషన్‌కు దారితీసింది.
గుడివాడ విమర్శలపై సీరియస్‌గా రియాక్ట్ అయిన పవన్..రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు మాత్రమే ఉండాలన్నారు. వ్యక్తిగత దాడులు, మహిళా నేతలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి వైసీపీ వారు దిగజారిపోయారన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలన్నారు పవన్. హోంమంత్రి అనితను ఉద్దేశించి గుడివాడ చేసిన వ్యాఖ్యలు..మహిళలందరినీ కించపరిచినట్లేనన్నారు జనసేనాని. అయితే టీడీపీ నేతల నుంచి మొదలు..పవన్ వరకు..అందరూ వరుసపెట్టి రియాక్ట్ అవడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గుడివాడ వ్యాఖ్యలు తప్పా..లేక అనిత కామెంట్సే వివాదానికి కారణమా అన్న విషయం పక్కన పెడితే..హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయని కూటమి దుమ్మెత్తిపోయడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో వైసీపీ మహిళా నేతలపై టీడీపీ సీనియర్ లీడర్లు చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. టీడీపీ మహిళా నేతలు అయితే ఏమైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి వస్తున్న ఎదురుదాడిని ఢీకొట్టేందుకు గుడివాడ అమర్‌నాథ్‌కు వైసీపీ నుంచి ఆ స్థాయిలో మద్దతు లభించకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. అయితే తాను మాట్లాడిన మాటలపై రాజకీయ దుమారం చెలరేగడంతో గుడివాడ ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు. తాను ఎప్పుడూ మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదని..సంస్కారహీనంగా మాట్లాడిన వ్యాఖ్యలనే ఖండించానని క్లారిఫికేషన్ ఇచ్చారు గుడివాడ.
గుడివాడ అమర్‌నాథ్ దూకుడు స్వభావం ఉన్న నేత. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు..ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన చేసిన కోడిగుడ్డు వ్యాఖ్యలను బేస్ చేసుకుని టీడీపీ ప్రతీసారి ఆయన్ను టార్గెట్ చేస్తోంది. ఏకంగా కోడిగుడ్డు మంత్రి అని పేరు కూడా పెట్టేశారు. ఈ క్రమంలోనే తమకు గుడ్లు కూడా పగలగొట్టొచ్చు అని అనిత కామెంట్స్ చేయడం..ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో గుడివాడ మాట్లాడిన మాటలు టీడీపీ అస్త్రంగా మారాయి. అయితే మహిళా నేతల విషయంలో చేసే విమర్శలు కొంత జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఇలాగే ఇబ్బందికరంగా మారొచ్చని అంటున్నారు. ఈ ఎపిసోడ్‌లో వైసీపీని టీడీపీ గట్టిగానే కార్నర్ చేసే స్కెచ్ వేస్తోంది. ఈ దుమారం ఇంకా ఎటు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి మరి.
